హైదరాబాద్ : ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను స్టార్ట్ చేసిందన్నారు.
అలాగే ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా వారి తరలింపునకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హెల్ప్‌లైన్‌ను సద్వినియోగ పరుచుకోవాలని మహేష్ కోరారు.
ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను సురక్షితంగా చేర్చడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చొరవకు ఎన్నారైల తరపున ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ నంబర్ – 70425 66955, 99493 51270, 96456 63661కు కాల్ చేసి సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు.