అమెరికా : అమెరికాలోని మసాచుసెట్స్- ఆరెంజ్ పట్టణంలోని జంప్ టౌన్ స్కైడైవింగ్ కేంద్రంలో స్కైడైవింగ్ చేసి కిందకు దిగుతున్న సమయంలో బలమైన గాలుల వల్ల పారాచూట్ నియంత్రణ కోల్పోయి గడ్డం మణిచంద్ర తేజ(28) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిన దవాఖానకు తరలించారు. దాదాపు 30 అడుగుల ఎత్తు నుండి కిందపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కాగా, మణిచంద్ర తల్లిదండ్రులు విజయవాడ నుండి కొడుకు చదువు కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడినట్లు సమాచారం. మణిచంద్ర నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తిచేసి ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.