Japan | తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం సంబురంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా జపాన్లో నివసించే తెలుగువారంతా ఆదివారం నాడు ఒక్క చోట చేరి ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి విందు చేసుకున్నారు. అనంతరం ఆటపాటలతో సంతోషంగా గడిపారు.
స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతీసంప్రదాయాలను మరిచిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సంక్రాంతి, ఉగాది, దీపావళి, దసరా పండుగలను టోక్యోలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం సందర్భంగా వన భోజనాల కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వన భోజనాలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.