Telangana | తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు అమెరికాలోనూ ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా 25 నగరాల్లో రాష్ట్రావతరణ వేడుకలను నిర్వహించి, తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు అమెరికా వ్యాప్తంగా బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర రావు, బియ్యాల జనార్దన్ రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. అమెరికా వ్యాప్తంగా రాష్ట్రావతరణ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
కొలంబస్లో నిర్వహించిన ఉత్సవాల్లో కేసీఆర్ బాల్యమిత్రుడు ఉమా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమా రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక పోరాట యోధుడు. బాల్యం నుండి పట్టుదల ఎక్కువ. సంకల్పం దార్శనికత, దక్షతకు మారు పేరు కేసీఆర్ అని ఆయన అన్నారు. చిన్ననాటి తీపి గుర్తులు నెమరువేసుకుంటూ కేసీఆర్ వ్యూహ రచన, రాజకీయ చాతుర్యాన్ని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆరంభించిన పనిలో విజయం సాధించే వరకు వదిలే వారు కాదని ప్రశంసించారు.
ఈ సందర్భంగా తన్నీరు మహేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారన్నారు. ప్రగతి, విద్య, వైద్యం ఆరోగ్యం, సంక్షేమం, విద్యుత్, వ్యవసాయం, సాగు నీరు, త్రాగు నీరు ఏ రంగమైనా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అమెరికా వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేణు పామేర, నరసింహ నాగులవంచ, డేవిడ్ విక్రమ్, సాజిత్ దేశినేని తెలంగాణ ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బే ఏరియాలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోనే కాదు అమెరికా అంతటా ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది. నేడు దశాబ్ది ఉత్సవాలు చేసుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు. కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ గణనీయమై ప్రగతి సాధించిందన్నారు. పూర్ణ బైరి, నవీన్ జలగం, తెలంగాణ ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
డ్యాలస్, టెక్సాస్‌లో శ్రీనివాస్ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో మూడు వందలకు పైగా ఎన్నారైలు పాల్గొన్నారు.
దేవేందర్ చిక్కాల, మనోజ్ ఇనగంటి, గిరిధర్ వీరమనేని, శ్రీకాంత్ పీచర, కిరణ్ మిర్యాల, కేశవ్ రావు, శశి దొంతినేని, ఉదయ్ యాదవ్, వంశీ దేవర, సత్యం యాదగిరి, దయాకర్ పుస్కూర్, అరుణ్ యాదవ్, హన్మంత్ బెజ్జంకి, విశేయ్ ఆరేపెల్లి, విష్ణు నాయిని, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
సిన్సినాటి నగరంలో నరసింహ నాగులవంచా ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. విష్ రెడ్డి గట్ల, గణేష్ కోట, సురేష్ దేవరకొండ, శరత్ రెడ్డి పోలు, వంశీ రామగిరి తదితరులు పాల్గొన్నారు.
ఆస్టిన్, టెక్సాస్ నగరంలో హరీష్ వ్యాల్ల ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ పొన్నాల, శ్రీనివాస్ పొట్టి, శ్రవణ్ కలకుంట్ల, సుధీర్ జలగం, సురేష్ గూడపురి, నర్సి రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, మహేష్ కసరపు, శ్రీకాంత్ రెడ్డి , అర్థం శ్రీనివాస్, చరణ్ పాల్గొన్నారు.
లాస్ ఏంజెల్స్ కాలిఫోర్నియా నగరంలో హరిందర్ తాళ్లపల్లి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో అనిల్ ఎర్రబెల్లి, నవనీత్ వోణి, వలబోజు చంద్ర, సంతోష్ గాంతారం, ప్రవీణ్ యరమడ తదితరులు పాల్గొన్నారు.
మహేష్ పొగాకు ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో జరిగిన కార్యక్రమంలో పాల్ డిగ్ట్రూట్ – కంటెస్టెంట్ మోరిస్ కౌంటీ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రవి ధన్నపునేని, భగవాన్ పింగిళి, శ్రీనివాస్ జక్కిరెడ్డి, వెంకట్ తమాలి పాల్గొన్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అనిల్ కేశినేని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమల్ వాల, వెంకట్ తాండ్ర, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
అనిల్ ధన్నపునేని ఆధ్వర్యంలో డెట్రాయిట్లో జరిగిన ఉత్సవాల్లో వెంకట్ మంతెన, సునీల్ మర్రి, కాశి కోట, శ్రీధర్ తిప్పి, సంతోష్, అశోక్ పాల్గొన్నారు.
బిందు రెడ్డి ఆధ్వర్యంలో కాన్సాస్‌లో జరిగిన ఉత్సవాల్లో రాజ్ చీదేళ్ల, వెన్నల, భారతి రెడ్డి పాల్గొన్నారు.
మహిపాల్ రెడ్డి వంచ ఆధ్వర్యంలో చికాగోలో నిర్వహించిన ఉత్సవాల్లో వెంకటేష్ రావు తుడి, శ్రీనివాస్ కాసుల, సాత్విక్ రెడ్డి మేకల, పూర్ణచందర్ అల్లంనేని, రాజేష్, కరుణాకర్ మాధవరం, నిఖిల్ బోయినపల్లి, భీం రెడ్డి అల్వాల, అమర్ నెట్టం, శ్రీనివాస్ వెలవర పాటి, అఖి రెడ్డి బోయ పాల్గొన్నారు.
శాక్రమెంటోలో సతీష్ పసుపులేటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో శిరీష పులిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు వంద మందికి పైగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
భాస్కర్ పిన్న ఆధ్వర్యంలో డెలావేర్లో నిర్వహించిన ఉత్సవాల్లో నిరంజన్ దొంతి, వైభవ్, మహేష్, గురు వేముగంటి, రవి గజ్జెల, శ్రీని, వెంకీ పాల్గొన్నారు.
వెంగల్ జలగం ఆధ్వర్యంలో చార్లెట్ నార్త్ కెరొలినాలో, అరవింద్ తక్కళ్లపల్లి ఆధ్వర్యంలో బోస్టన్‌లో, గణేష్ వీరమనేని ఆధ్వర్యంలో సియాటిల్‌లో, నిరంజన్ అల్లమనేని ఆధ్వర్యంలో మిన్నియాపోలిస్‌లో, అట్లాంటా, ఫ్లోరిడా – మియామీ, టంపా, డేటన్, పోర్ట్లాండ్, ఫీనిక్స్, ఇండియానాపోలిస్ ఇంకా అమెరికాలోని ప్రధాన నగరాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.