Telangana decade celebrations | స్విట్జర్లాండ్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
స్విట్జర్లాండ్‌లో (Switzerland) తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) తెలంగాణ ఎన్ఆర్ఐలు (Telangana NRI's) ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లో (Switzerland) తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) తెలంగాణ ఎన్ఆర్ఐలు (Telangana NRI’s) ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుచేసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల కేక్ కట్‌చేసి తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) స్విట్జర్లాండ్ అధ్యక్షుడు శ్రీధర్ గందె మాట్లాడుతూ.. కేసీఆర్ (CM KCR) పట్టుదల, దీక్ష కారణంగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. సాధించిన రాష్ట్రాన్ని గత తొమ్మిదేండ్లుగా ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న తీరును వివరించారు.
హరిత హారం స్ఫూర్తితో ఆరుబయట చెట్ల మధ్యన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పెషల్ దమ్ బిర్యానీని అందరూ ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పవన్ దుద్దిళ్ల, పద్మజ రెడ్డి, కిషోర్, అల్లు కృష్ణ, అనిల్ జాల, విజయ్, ప్రశాంత్, రాజేందర్, యువరాజ్, నాగరాజ్, ప్రవీణ్, రాజశేఖర్, అనిల్ రెడ్డి, దశరథ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- NRI NEWS
- Sridhar gande
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

