తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబాలు హాజరయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక హౌంస్లౌ మేయర్ కారెన్ స్మిత్, భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ , నిర్మల దంపతులు, భారత హై కమిషన్ ప్రతినిధి అజయ్ కుమార్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర ఎఫ్డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కౌన్సిలర్లు ప్రీతమ్ గ్రేవాల్ , అజ్మీర్ గ్రేవాల్, ప్రభాకర్ ఖాజా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ – దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు.
దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుంచి తీసుకొచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఒకరికొకరు చేనేత శాలువలను, జమ్మి(బంగారం) ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలనే ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.యూకేలో తన 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, నిర్మల దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మ ను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తునందుకు టాక్ సంస్థను పలువురు అభినందించారు.
గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో కేటీఆర్ కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతి ఏడాదిలాగే చేనేత బతుకమ్మ – దసరా పండుగలను ఘనంగా జరుపుకున్నామని పేర్కొన్నారు.
యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని.. వీరి స్ఫూర్తి చాలా గొప్పదని ముఖ్య అతిథులు కొనియాడారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని తెలిపారు.
టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలను సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.
అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. టాక్ సంస్థ కార్యకర్తగా, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ వేడుకలో పాల్గొన్నానని తెలిపారు. రాజకీయ వేదికలైనా.. సమాజిక సంస్థలకు సంబంధించిన వేదికలైనా సరే లండన్ గడ్డపై ఎత్తిన జెండాను దించకుండా టాక్ కార్యవర్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. టాక్ కార్యవర్గాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ బతుకమ్మ వేడుకలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులు, ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. టాక్ కార్యవర్గానికి అన్ని సందర్భాల్లో కవితక్క వెన్నంటి ఉండి ప్రోహించారని, టాక్ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున తెలిపారు.
తమ పిలుపు మేరకు వేడుకలకు చేనేత బట్టలు ధరించి హాజరు కావడం పట్ల టాక్ మహిళా నాయకులు క్రాంతి రేతినేని, శ్వేతా మహేందర్ , శ్రీ విద్య హర్షం వ్యక్తం చేశారు.
టాక్ ఉపాధ్యక్షుడు సత్య చిలుముల మాట్లాడుతూ.. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారని తెలిపారు.
ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికీ టాక్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేత వస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు.
టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి టాక్ కమ్మూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ నవీన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు.
హాజరైన అతిథులందరికీ తెలంగాణ పండగ భోజనాన్ని స్పాన్సర్ చేసిన నాగరాజు తౌటం మరియు శృతి దంపతులని మరియు లండన్ పర్యటనలో ఉన్న వారి తల్లి తండ్రులని టాక్ సంస్థ ప్రత్యేకంగా సన్మానించి గౌరవించారు.
టాక్ కార్యదర్శులు రాకేష్ పటేల్ మరియు సత్యపాల్ రెడ్డి పింగళి మాట్లాడుతూ… గతం లో ఎన్నో సందర్భాల్లో నాగరాజు టాక్ సంస్థకు వివిది సహాయ సహకారాలు అందించారని, అలాగే ఎల్లపుడూ దాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసి వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ కార్యదర్శి హరి నవాపేట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, కాబట్టి కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు.
టాక్ కార్యదర్శులు రవి రేతినేని, సుప్రజ పులుసు , గణేష్ కుప్పాల మాట్లాడుతూ మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకరించిన స్పాన్సర్ సంస్థలకు మరియు స్థానిక అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని. ఒక పక్క వ్యక్తిగతంగా రోజు వారి పనుల్లో బిజీగా వున్నప్పటికీ, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు.ఉత్తమ 10 బతుకమ్మలకు గోల్డ్ కాయిన్స్ బహుమతి మరియు బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు.
Bathukamma8
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్డీసీ మాజీ చైర్మన్ , టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి – సత్యమూర్తి చిలుమలా , టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ముఖ్య సభ్యులు పవిత్ర కంది , స్వాతి బుడగం, సుప్రజపులుసు, వెంకట్ రెడ్డి దొంతుల,సత్యంకంది ,నవీన్ రెడ్డి ,మల్లా రెడ్డి, సత్యపాల్ , రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ ,మాధవ రెడ్డి ,సతీష్ రెడ్డి , హరి గౌడ్ నవాబ్ పేట్,క్రాంతి రేటినేని, శశి, తేజ , నిఖిల్, ప్రవీణ్ వీర, రంజిత్,కార్తీక్, శ్రీధర్ రావు,గణేష్ కుప్పాల ,నవ్య , స్నేహ,శైలజ, శ్రీ విద్య, అంజన్ రావు, పృద్వి రావుల , మహేందర్, శ్వేతా మహేందర్, మౌనిక, శ్రావ్య, ప్రసాద్, అబ్దుల్ జాఫర్, దీపక్ ,రాజేష్ వాక , నాగరాజు , మ్యాడి యువజన విభాగం నాయకులు రమేష్, శ్రవణ్ రెడ్డి, తరుణ్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.