లండన్: బ్రిటన్ రాజధాని లండన్లో (London) బోనాల జాతర (Bonala Jatara) ఘనంగా జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్-TAUK) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో యూకే నలుమూలల నుంచి 12వందల మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనేకాకుండా స్థానికులని కూడా ముగ్దులను చేసింది. లండన్లో ఉన్నత చదువులకోసం వచ్చిన అక్షయ్ మల్చేలం.. వారి వంశవృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి బోనాల ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర మేయర్ అఫ్జల్ కియానీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని చెప్పారు. వారి స్ఫూర్తి చాలా గొప్పదన్నారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని వెల్లడించారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎలాంటి సహాయం అవసరమైనా తనను సంప్రదించవచ్చని, లండన్లో భిన్న సంస్కృతుల ప్రజలు నివసిస్తారని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు సాగాలన్నారు.
Tauk
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్దఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లోకి రావడం చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరికి ఆయన బహుమతులు అందజేశారు.
Tauk
ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాలు, బంగారు తెలంగాణలో ఎన్నారైల పాత్ర గురించి అందరికి గుర్తుచేశారు. బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించి, టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు చేయడం ఉత్సాహాన్ని నింపిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి అన్నారు. తాము చేస్తున్న, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
Tauk
లండన్లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి అన్నారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు, బతుకమ్మ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గత దశబ్ద కాలం తెలంగాణ సంస్కృతిని అనిల్ కూర్మచలం ఎంతో ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేసుకున్నారు.
Tauk
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి తెలంగాణ ప్రగతిని దేశానికి తెలిసేలా చేశారని కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ నవీన్ రెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో నేడు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రవాస తెలంగాణ బిడ్డలంతా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.
Tauk
ప్రముఖ నృత్య కళాకారిణి రాగసుధా వింజమూరి చేసిన మహాశక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. టాక్ సంయుక్త కార్యదర్శి గొట్టిముక్కల సతీష్ రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జాహ్నవి, హరి గౌడ్ నవపేట్, సత్య చిలుముల, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి, సత్య చిలుముల, మట్టా రెడ్డి, మల్లా రెడ్డి బీరం, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్వేతా మహేందర్, రవి రేతినేని, రవి పులుసు, గణేష్ కుప్పలా, శ్రీకాంత్ జెల్లా, మధుసూదన్ రెడ్డి, రాజేష్ వాకా, శ్రీవిద్య, శ్రావ్య, భూషణ్ ఉప్పల, మౌనిక డూడ్ల్, రంజిత్, విజిత, శ్రీధర్ రావు, గణేష్ పస్తం, శశి, అవినాష్, తేజా తదితరులు పాల్గొన్నారు.
Tauk
Tauk
Tauk
Tauk
Tauk