Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్‌చే శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజులపాటు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సింగపూర్‌లోని నలుమూలల నివసించే తెలుగు వారందరికీ అందుబాటులో ఉండేలా ఐదు వేరు వేరు వేదికల్లో ఐదు భాగాలుగా, 15 గంటల పాటు ఈ ప్రవచనం సాగింది. రామాయణంలోని ఏడు కాండలు, రామాయణ ప్రాశస్త్యం సవివరంగా ప్రవచించారు.
సింగపూర్‌లోని పంగోల్ రివర్వెల్, బర్గండీ క్రెసెంట్, మెల్విల్, కాన్బర్రా, జూబిలీ రోడ్డు వేదికలలో ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రవచనాలు జరిగాయి. అలాగే బీవీఆర్ చౌదరి నివాసంలో నిత్య సుందరకాండ పారాయణ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఈ నెల 15వ తేదీన రామ పట్టాభిషేకంతో ఈ పారాయణం కార్యక్రమానికి ముగింపు పలికారు. ఈ ఐదు వేదికల్లో సుమారు 250 మంది తెలుగు వారు పాల్గొన్నారు. అలాగే సింగపూర్ తెలుగు టీవీ సాంకేతిక సహకారంతో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇక ఆన్లైన్ ద్వారా దాదాపు 2 వేల మందికి పైగా వీక్షించారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి దంపతులు, సౌభాగ్యలక్ష్మీ రాజశేఖర్ తంగిరాల దంపతులు, సుబ్బు పాలకుర్తి మాధవి దంపతులు, సత్య జాస్తి సరిత దంపతులు, రామాంజనేయులు చామిరాజు రేణుక దంపతులు, రంగా ప్రకాష్ కాండూరి తేజస్విని దంపతులు సహకరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాధిక మంగిపూడి, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యానం చేశారు. అన్నదానానికి అనేక మంది ఆర్థిక సహాయం అందించారు. వారందరికీ సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదు వేదికల్లో రామనామ కీర్తనలు ఆలపించిన గాయనీమణులు కృష్ణకాంతి , స్నిగ్ద ఆకుండి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, కాండూరి శ్రీసన్వి, శ్రీధన్వి, షర్మిల చిత్రాడ లకు నిర్వాహుకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Singapore3
సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు ప్రకాశరావు దంపతులు, రంగా రవి దంపతులు, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్న ఈ సభలో, సింగపూర్ తెలుగు టీవీ నిర్వాహకులు గణేశ్న రాధాకృష్ణ కాత్యాయని దంపతులు, సత్య జాస్తి కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. సంస్థ సభ్యులు పాతూరి రాంబాబు, శ్రీధర్ భారద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, గుంటూరు వెంకటేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.
Singapore4
Singapore5
Singapore6
Singapore7
Singapore8
Singapore9