Bathukamma | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు స్థానిక `సంబవాంగ్ పార్క్`లో శనివారం ఎంతో కన్నుల పండువగా జరిగాయి. చిన్న,పెద్ద తేడా అనే లేకుండా అందరూ సంప్రదాయ పాటలు, ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ వాసులతోపాటు ఎన్నారైలు సుమారు నాలుగు వేల మంది పాల్గొన్నారు.
సింగపూర్లో నివసిస్తున్న తెలుగు వారికి, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యాన్ని తెలిపామని టీసీఎస్ఎస్ సభ్యులు చెప్పారు. దశాబ్ద కాలానికి పైగా సింగపూర్లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ లభించడంతో టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు సౌజన్య డేకోర్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. వీరితోపాటు `సింగా దాండియా ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో 10 మంది అదృష్ట విజేతలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ ఏడాది బతుకమ్మ సంబురాలకు సమన్వయ కర్తలుగా టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సారి విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రొమో పాట యూట్యూబ్ లో విడుదల చేసినప్పడినుండి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్, భాస్కర్ గుప్తా నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైస, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి తదితరులు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల, గోనె రజిత, కాసర్ల వందన, రాధికా రెడ్డి నల్ల, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు తదితరులు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.