హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు, 7 నగరపాలక సంస్థలకు ఫిబ్రవరి 11 న ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులనుభరి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నారైల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
ఎన్నారై సెల్ ద్వారా ఆయా మున్సిపాల్టీలలో సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని విస్తృత ప్రసారం చేస్తామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు.