హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐఐసీలో బుధవారం ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ప్లీనరీకి టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందన్నారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో UK, USA, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, మలేషియా, దక్షిణాఫ్రికా, టాంజానియా, మారిషస్, జాంబియా, నార్వే, ఖతార్, ఫిలిప్పీన్స్, చైనా, జర్మనీ, ఒమన్ తదితర దేశాల ప్రతినిదులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా ప్రతినిధులు..
టాంజానియా ప్రతినిధులు..