Nagaraju Gurrala : ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ అవార్డు గెలుపొందిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు(Nagaraju Gurrala) అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 17న బ్రిటన్ House of Lords లో సంతోష్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు ఎంపికైనందున మాజీ ఎంపీని నాగరాజు గుర్రాల హృదయపూర్వకంగా అభినందించారు.
‘గ్రీన్ ఇండియా ‘Green India Challenge’ ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చి, దేశవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రేరేపించిన మీ కృషి విశేషమైనది. ఈ ఉద్యమం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా 2019లో దక్షిణాఫ్రికాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
అప్పుడు దక్షిణాఫ్రికాలోని తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు మీ అంకితభావానికి నిదర్శనం. భవిష్యత్తులో కూడా పచ్చని, సుస్థిర ప్రపంచ నిర్మాణంలో మీ నాయకత్వం మరింత స్ఫూర్తినిచ్చేలా కొనసాగాలని సౌత్ ఆఫ్రికా శాఖ తరపున ఆశిస్తున్నాం’ అని గుర్రాల నాగరాజు అన్నారు.