అమెరికాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
మంత్రి కేటీఆర్ | మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి.

అమెరికా : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. అమెరికా న్యూ జెర్సీలోని టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికాలో శ్రీనివాస్ గనెగొని, రవి ధన్నపనేని, శ్రీనివాస్ గన్గొని, భగవాన్ పింగ్లే, రవి తోట ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..ముక్కోటి వృక్షార్చనకు సంఘీభావంగా అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ శాఖలు మొక్కలు నాటి మద్దతు తెలిపారన్నారు.
న్యూ జెర్సీలో ఉన్న కేటీఆర్ మిత్రులు మాట్లాడుతూ.. కేటీఆర్ న్యూ జెర్సీలోనే ఉండే వారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణని ప్రపంచ పటంలో పెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
కార్యక్రమంలో వీడియో కాల్లో గండ్ర రమణారెడ్డి (ఎమ్మెల్యే భూపాలపల్లి), చల్ల ధర్మా రెడ్డి (ఎమ్మెల్యే పరకాల), లింగంపల్లి కిషన్ రావు (ఆగ్రో చైర్మన్ ), రగురి జయపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ పరకాల సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసినందుకు మహేష్ బిగాల నిర్వాహకులను అభినందించారు.

ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్‌స్ట్రోక్ చాంపియన్‌గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

