టోక్యో: ఒలింపిక్ క్రీడల్లో అలస్కా స్విమ్మర్ కొత్త రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల లిడియా జాకొబీ .. మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. అమెరికాకు చెందిన లిడియా ఈ ఈవెంట్లో ఫెవరేట్లకు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈత పోటీల్లో దక్షిణాఫ్రికాకు చెందిన తత్జానా షాన్మేకర్కు సిల్వర్ , లిల్లీ కింగ్‌కు కాంస్య పతకాలు దక్కాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో లిల్లీ కింగ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. జాకొబీ పేరెంట్స్ ఇద్దరూ బోటు కెప్టెన్లు. అయితే తమ కూతురు నీటిలో సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆమెకు చిన్ననాటి నుంచే ఈత నేర్పారు. ఇప్పుడు ఆ నిర్ణయం ఒలింపిక్ టైటిల్ రూపంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. జాకొబీ 1:04.95 సమయంలో లక్ష్యాన్ని అందుకున్నది. వాస్తవానికి రెండు రోజుల క్రితం సెమీఫైనల్లో షాన్మేకర్ 1:04.82 సమయంలో ఒలింపిక్ రికార్డును క్రియేట్ చేసింది. కానీ ఫైనల్లో హేమాహేమీలకు జాకొబీ షాకిచ్చింది.