నల్లబెల్లి : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల (మేడే ) దినోత్సవం వేడుకలు సింగపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు గడప రమేష్ సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ, ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న కార్మికులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ కు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సొసైటీ ఉపాధ్యక్షుడు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ పాల్గొన్నారు.