పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేసిన మహేష్ బిగాల
ఎన్నారై | పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సోమవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు.

హైదరాబాద్ : విదేశాల్లో పీవీ జయంతి శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా సమన్వయం చేసినందుకు పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలను సీఎం కేసీఆర్ అభినందించారు. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు, ఎన్ఆర్ఐ సంస్థలను కూడా సీఎం ప్రశంసించారు. ఏడాది పొడవునా నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు 28 జూన్,2021న విజయవంతంగా పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహేశ్ బిగాల సీఎం కేసీఆర్‌ను కలిశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వివరాలను సీఎంకు అందజేశారు.
అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిర్వహించిన వెబ్నార్లలో పీవీకి భారతరత్న ఇవ్వాలని వచ్చిన డిమాండ్‌ను మహేష్ బిగాల ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై 80 పైచిలుకు ఎన్నారై, ఎన్నారై సంస్థల తరఫున సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. పీవీకి భారతరత్న అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా సీఎంను కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశానుసారం, పీవీ సెంటెనరీ కమిటీ చైర్మన్ మార్గదర్శకత్వంలో మంత్రి కేటీఆర్‌తో కలిసి పీవీ సెంటెనరీ కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కన్వీనర్ మహేష్ బిగాలా పీవీ శతాబ్ది ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో విజయవంతంగా సమన్వయం చేశారు. వివిధ దేశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. యూఎస్ఏ, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, మారిషస్, డెన్మార్క్, స్వీడన్, న్యూజిలాండ్, లాట్వియాతో పాటు అనేక దేశాల్లో శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో అతిథులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాలలో కమిటీ చైర్మన్ కేశవరావు, ఎంఎల్‌సి కవిత, ఎంఎల్‌సి వాణి దేవి, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, చెన్నమనేని రమేష్, ఎమ్మెల్యే, పీవీ మనవడు కశ్యప్, పలువురు అతిథులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్‌కు భారీ టీమ్‌ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

