Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి భారత ప్రతినిధి బృందం కువైట్ చేరుకుంది. గులాం నబీ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీతో కూడిన ఈ బృందం కువైట్ ఉప ప్రధాని షరీదా అల్ ముషార్జీతో తాజాగా సమావేశమైంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకున్న చర్యలను వివరించింది. భారత ప్రతినిధి బృందం ఇతర సీనియర్ కువైట్ అధికారులతో కూడా సమావేశమైంది. అనంతరం కువైట్‌లోని గ్రాండ్ మసీద్‌ను కూడా సందర్శించింది. భారతదేశ సమాజానికి చెందిన ప్రముఖులతో, పత్రిక ప్రతినిదులతో భారత్-పాకిస్థాన్ వివాదానికి దారితీసిన పరిస్థితులు, ఆపరేషన్ సిందూర్ తదననంతర పరిణామాల గురించి భారత ప్రతినిధి బృందం సమావేశం నిర్వహించింది.
బీజేపీ ఎంపి వైజయంత్ పాండే నేతృత్వంలోని ఈ బృందంలో ఇద్దరు మహిళలు సహా 8 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, ఫాంగ్నోన్ కొన్యాక్, రేఖా శర్మ, గ్రూప్‌లోని ఇతర సభ్యులు, AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు సత్నామ్ సింగ్ సంధు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా ఈ బృందంలో ఉన్నారు. బహ్రెయిన్‌లో పర్యటన ముగించుకున్న తర్వాత ఈ బృందం కువైట్ చేరుకుంది. ఈ బృందం ఇక్కడి నుంచి సౌదీ ఆరేబియా రాజధాని రియాద్‌కు.. అక్కడి నుంచి మే 30న అల్జీరియాకు వెళ్లనుంది.
Kuwait1