ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో 15000 ఫీట్ల ఎత్తు నుంచి స్కై డైవ్ చేస్తూ సీఎం కేసీఆర్కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియలోని సిడ్నీ , అడిలైడ్ , మెల్బోర్న్ , కాన్బెర్రా , బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ , బెండీగో, బల్లారాట్ నగరాలలో TRS ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సభ్యులందరూ కేసీఆర్ ఆరోగ్యం ఉండాలని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేశారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను కేసీఆర్ సాకారం చేశారన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేశామన్నారు.
తమ అభిమాన నాయకుడికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసిన వినయ్ సన్నీ గౌడ్ ను సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు.