హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (green india challenge) విదేశాల్లోనూ కొనసాగుతున్నది. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిగా గత నెలలో శ్రీలంకలో మొక్కలు నాటగా, తాజాగా జపాన్‌లోనూ మొక్కలు నాటారు.
జపాన్‌లో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ కొహానా ఇంటర్నేషనల్ స్కూల్లో మూడు మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటానని చెప్పారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతిఒక్కరూ తమ వంతుగా కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. రాజ్‌గ్రూప్, నిర్వానమ్ అండ్ నేహా ఎన్ టెక్నాలజీస్ సంస్థల ఆధ్యర్వంలో ఈ కార్యక్రమం జరిగింది.