కరీంనగర్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ బిల్లుల బకాయిలు చెల్లించాలని నిరసనకు దిగుతున్న తాజా మాజీ సర్పంచులపై(Former sarpanches) జులుం ప్రదర్శిస్తున్నది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అడిగితే అణచివేత చర్యలకు దిగుతున్నది. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేశారు. మెయిన్ గేటు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించాకే లోనికి అనుమతిస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం రూ.750 కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేయడమే ప్రజాపాలనా? అని నిలదీశారు. బిల్లులు మంజూరు అయ్యేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.