హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ..పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ వెంటే తామంతా ఉంటామన్నారు. కార్యక్రమంలో హరీష్ రంగ, గుండా జై విష్ణు, సాయి కిరణ్ నల్ల , నవదీప్ రెడ్డి, శివా రెడ్డి, నామా రాజేశ్వర్, సౌజన్ రావు తదితరులు పాల్గొన్నారు.