USA vs PAK | యూఎస్ఏను తిప్పేసిన తారీఖ్, షాదాబ్.. గ్రూప్ ఏలో అగ్రస్థానంలో పాకిస్థాన్..!
USA vs PAK : ప్రపంచకప్‌లో తొలి పోరులో అతికష్టమ్మీద గెలిచిన పాకిస్థాన్ రెండో మ్యాచ్‌లో సాధికారిక విజయం సాధించింది. ఓపెనర్ ఫర్హాన్ (73), బాబర్ ఆజాం(46)ల మెరుపులతో భారీ స్కోర్ చేసిన పాక్.. అనంతరం యూఎస్ఏను కట్టడి చేసింది.
USA vs PAK : ప్రపంచకప్‌లో తొలి పోరులో అతికష్టమ్మీద గెలిచిన పాకిస్థాన్ రెండో మ్యాచ్‌లో సాధికారిక విజయం సాధించింది. ఓపెనర్ ఫర్హాన్ (73), బాబర్ ఆజాం(46)ల మెరుపులతో భారీ స్కోర్ చేసిన పాక్.. అనంతరం యూఎస్ఏను కట్టడి చేసింది. శుభం రంజనే(51), షయాన్ జహంగీర్(49) పోరాడినా స్పిన్నర్ ఉమర్ తారీఖ్(3-27), షాదాబ్ ఖాన్(2-26)లు తిప్పేయడంతో మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో.. 33 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్ 4 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
పాక్ నిర్దేశించిన భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించారు యూఎస్ఏ ఓపెనర్లు. అండ్రీస్ గౌస్(13), షయాన్ జహంగీర్(49)లు బౌండరీలతో చెలరేగి పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. కానీ, నవాజ్ తన మొదటి ఓవర్లోనే గౌస్‌ను బోల్తా కొట్టించాడు. కాసేపటికే కెప్టెన్ మొనాంక్ పటేల్(3)ను షాదాబ్ ఖాన్(2-26) వెనక్కి పంపగా.. జహంగీర్, మిలింద్ కుమార్(29)లు ఆచితూచి ఆడారు. పవర్ ప్లేల అనంతరం స్పిన్నర్లు రంగలోకి దిగడంతో బౌండరీలు రాలేదు.
No upset this time!
Pakistan hold off USA to make it two wins from two at this year’s #T20WorldCup 🇵🇰
Scorecard: https://t.co/A8ofIAfuj6 pic.twitter.com/ByyQsSq4lq
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026
దాంతో.. ఒత్తిడి పెరిగి జహంగీర్, మిలింద్‌లు పెద్ద షాట్ ఆడి వికెట్ పారేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో ఉమర్ తారీఖ్(3-25) వైవిధ్యమైన బౌలింగ్‌లో షాట్లు ఆడలేక అమెరికా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. సహచరులు వెనుదిరుగుతున్నా శుభం రంజనే(51) అర్ధ శతకంతో పోరాడాడు. కానీ, అది సరిపోలేదు. ఆఖరి ఓవర్లో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. దాంతో, 33 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది.
ఆ ఇద్దరి మెరుపులతో
పొట్టి ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లోనూ అమెరికా పేసర్ శాడ్లీ వాన్(4-25) వికెట్ల వేటతో రెచ్చిపోయాడు. కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్లో పాకిస్థాన్ బ్యాటర్లను బోల్తా కొట్టించిన అతడు.. 190లోపే పాక్‌ను కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. యూఎస్ఏ బౌలర్లును సమర్ధంగా ఎదుర్కొన్న ఓపెనర్ ఫర్మాన్(73) అర్ధ శతకంతో రాణించగా.. బాబర్ ఆజాం(46) ఫామ్ చాటుకుంటూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లలో షాదాబ్ ఖాన్(30) దంచేశాడు. దాంతో.. పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి190 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?


