హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా సింగపూర్లో ఉన్న తెలుగు కార్మికులు క్రికెట్ పోటీలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సారథ్యంలో మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ (MFCL) ని టెర్సన్ రిక్రియేషన్ సెంటర్లో మూడు రోజుల పాటు పోటీలను నిర్వహించింది. సింగపూర్లో నలుమూలలో నివసించే కార్మికులు మొత్తం 12 టీంలుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్ ముత్యాల రమేశ్ నాయకత్వంలో కూల్ ట్రంప్స్ (పెంజూరు) విజేత గా నిలవగా, చిన్నబోయిన రవి కుమార్ నాయకత్వంలో దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్) టీం ద్వితీయ, సంకాబత్తుల దుర్గ బాబు నాయకత్వంలో రాయల్ గైస్ (కాకిబుకిత్) టీం తృతీయ స్థానం కైవసం చేసుకుంది. మొదటి బహుమతిగా 500 డాలర్స్, ద్వితీయ బహుమతి గా 300 డాలర్స్, తృతీయ బహుమతిగా 200 డాలర్స్చ ట్రోఫీ ని విజేతలకు నిర్వాహుకులు అందచేశారు.
మాన్ అఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్,బెస్ట్ క్యాచ్ అవార్డులను అందజేశారు. గిరిధర్ సారాయి నాయకత్వంలో జరిగిన కార్యక్రమములో అనేకమంది వాలంటీర్స్ పలు సేవలందించారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు రమేష్ గడప, నీలం మహేందర్. గారెపల్లి శ్రీనివాస్, కొల్లా శివప్రసాద్ తదితరులు నిర్వాహుకులను, క్రీడాకారులను అభినందించారు.