 
                                                            లండన్ : సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ..
హిందు, ముస్లింల మత సామరస్యానికి రంజాన్ దీక్షలు ప్రతీక అని అన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
అలాగే తెలంగాణలో సీఎం కేసీఆర్ ముస్లింలకు రాజకీయంగా, సామాజికంగా అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీలుగా, ఉప కులపతులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఇలా ఎన్నో ఉన్నతమైన పదవులనిచ్చి, మైనారిటీల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. ముస్లిం నాయకుడు సయీద్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వలో ముస్లింలు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు.

కేసీర్ నాయకత్వంలోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమన్నారు. ప్రతి సంవత్సరం క్రమంగా తప్పకుండా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ సమాజానికి ఆదర్శనంగా నిలుస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు, యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, రమేష్ ఇస్సంపల్లి అధికార ప్రతినిధులు రవి కుమార్ రేతినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి , నవీన్ మాదిరెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జి ప్రశాంత్ కటికనేని, మధు ఆబోతు ,ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి, గణేష్, నవాజ్, మసూద్, షరీఫ్, షా సాబ్, ఆదిల్, ఫయాజ్, ఫైసల్ ఖాన్ తదితరులు ఉన్నారు.


 
                            