BRS NRI South Africa | తెలంగాణ జాతిపిత కేసీఆర్పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసుల పేరుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నాగరాజు గుర్రాల మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, తన పరిపాలనా వైఫల్యాలను దాచిపెట్టేందుకు కేసీఆర్పై తప్పుడు కేసులు పెడుతూ.. నోటీసులు జారీ చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిపై ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు దిగుతోందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు నరేందర్ రెడ్డి మేడసాని, కిరణ్ కుమార్ బెల్లి, నామ రాజేశ్వర్, సాయి కిరణ్ నల్ల, సాయి కిరణ్ వెముల, వెంకట్ రావు తల్లపల్లి, మహేందర్ రెడ్డి ఎల్లానుల్ల, అనిల్ విప్పర్తి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలంతా కేసీఆర్కు అండగా నిలుస్తారని, ఇలాంటి రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని నాగరాజు గుర్రాల స్పష్టం చేశారు. కేసీఆర్ ఒంటరి వారు కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Sangareddy | రేపే పశువుల జాతర.. 359 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం గురించి తెలుసా!
Harish Rao | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం : మాజీ మంత్రి హరీష్ రావు