హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఆయన సోదరుడు మహేష్‌కి పితృవియోగం పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాగరాజు గుర్రాల మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు, మహేష్ తన్నీరు, వారి కుటుంబ సభ్యులకు సౌతాఫ్రికా శాఖ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ దుఃఖ సమయంలో భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యం, ఓర్పు ప్రసాదించాలని కోరుకుంటున్నాము అని అన్నారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అని పేర్కొన్నారు.