BRS NRI Kuwait cell | ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి భాషని, ఎన్నారైలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ ఉపాధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ తెలంగాణవాసులందరిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
బతుకుదెరువుకు కోసం వివిధ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తమ పనులు తాము చేసుకోవడాన్ని అవమానకరమైన పని లాగా మాట్లాడడం, ఎగతాళి చెయ్యడం సరికాదని, తెలంగాణ గడ్డ అంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక అని అలాంటి ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇటీవల కొత్తగా గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో సర్పంచులకు మంచి చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని అభిలాష మండిపడ్డారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి డైవర్సిన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తుందన్నారు.
రాష్ట్ర పరువు తీయడం తప్ప చేసిందేమి లేదు..
కేసీఆర్ హయాంలో ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీలు, ఐటీ హబ్‌లు, వృద్దులకు ఫించన్లు, ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం, రైతులకు అనేక పథకాలు ( రైతు భీమా, రైతు భరోసా ) ఇస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌గా తీర్చి దిద్దితే గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ గానీ , పథకాలు గానీ లేవని పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం అలాగే కేసీఆర్ కుటుంబం మీద పడి ఏడవడం, నీచంగా మాట్లాడటం , కేసులు పెట్టడం , ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పరువు తీయడం తప్ప చేసిందేమి లేదని మండిపడ్డారు.
అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి, అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని అభిలాష స్పష్టం చేశారు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!