KCR Birthday | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో బీఆర్ఎస్ క్వీన్స్ ల్యాండ్ కన్వీనర్ విన్నీ తుమకుంట ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాలు, వృక్షార్చన తో అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విన్నీ తూముకుంట మాట్లాడుతూ.. అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన కేసీఆర్ ధీర్ఘాయుష్యుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్లీ తెలంగాణా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.
Brs Australia1
తరుణ్ కొండo, రవి బతుక, శ్రీవేకర్ రెడ్డి పుల్యాల, రాజేష్ గుట్ట, రాకేష్ కాస, సంతోష్ రెడ్డి, మధు, శ్రీనివాస్ ఏలిజాల, యుగేందర్ రెడ్డి, రవి యాదవ్‌లు వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.