హైదరాబాద్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరం (Blood donation camp)విజయవంతమైంది .హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన శిబిరానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేశారు. హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ వరుసగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని(Commendable) అన్నారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ( Telangana cultural Society) ని వారు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలు గా రవి చైతన్య మైస, సంతోష్ వర్మ మాదారపు , వెంకట రమణ వ్యవహరించారు. రక్త దానం చేసిన వారిలో సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల , సంతోష్ వర్మ మాదారపు , సభ్యులు ముక్కా కిషోర్, ముక్కా సతీష్, వినయ్ చంద్, నవీన్ కటకం, మల్లిక్ పల్లెపు, నవీన్ నోముల, సాయి బాలె తదితరులున్నారు.
ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు(Society President) గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్తా, కమిటీ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల ధన్యవాదాలు తెలిపారు.