హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో వైభవంగా జురుపుకునే ఈ పండుగా ఇప్పుడు ఖండాతరాల్లోను తెలంగాణ ఎన్నారైలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కాగా, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పారిస్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి ఉయ్యాల, కోలాట పాటలతో ఆడిపాడారు.