Bathukamma | అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. స్థానిక హిందూ టెంపుల్ అండ్ కల్చరల్సెంటర్లో నిర్వహించిన బతుకమ్మ పండుగలో దాదాపు రెండు వేల మంది హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆడబిడ్డలు ఆటపాటలతో ఆలరించారు. ఈ సందర్భంగా సాహిత్య వింజమూరి వ్యాఖ్యానం అందర్నీ ఆకట్టుకుంది.
బతుకమ్మ వేడుకల సందర్భంగా చిన్నపిల్లలు కోలాటంతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ బతుకమ్మ కాంపిటీషన్, బతుకమ్మ రీల్స్ కాంపిటీషన్, బతుకమ్మలు తీసుకొచ్చిన ఆడపడుచులకు రాఫెల్ ప్రైజెస్, తెలుగు అసోసియేషన్ పండుగ అలంకరణలు ప్రత్యేకంగా నిలిచాయి. వేడుకలు ముగిసిన తర్వాత తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ నిర్వాహకులు కమ్మని విందుని అందించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు, దాతలకు సంఘం అధ్యక్షురాలు శ్రావణి మేక, ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీనివాస్ పెనుగొండ ధన్యవాదాలు తెలిపారు.
Kansas Bathukamma1
Kansas Bathukamma2
Kansas Bathukamma4
Kansas Bathukamma5
Kansas Bathukamma6
Kansas Bathukamma7
Kansas Bathukamma8
Kansas Bathukamma9
Kansas Bathukamma10
Kansas Bathukamma11
Kansas Bathukamma12