NRI news | రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు తమ మూలాలను మరవకుండా మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న (శనివారం) సంబవాంగ్ పార్క్‌లో జరుగనున్న ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. సింగపూర్‌లో ఉంటున్న ఇతర తెలుగు ప్రజలకు కూడా మన బతుకమ్మను పరిచయడం చేయడం టీసీఎస్‌ఎస్‌కు దక్కిన గౌరవమని నిర్వాహకులు అన్నారు. తెలంగాణ సాంప్రదాయంలో భాగంగా వస్తున్న ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ లాంటి పాటలతో బతుకమ్మ పండుగ గౌరవాన్ని కాపాడాలని సభ్యులు కోరారు.
బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, ఉత్తమ బతుకమ్మలకు ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తామని తెలిపారు. ప్రతీ ఏడాదిలానే పండుగలో పాల్గొనే వారందరికి ఆహారంతోపాటు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. సింగపూర్‌లో ఉన్న తెలుగు వారితోపాటు మిగితా రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంబురాల్లో పాల్గొనాలని స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి ముందుకువచ్చిన కిరణ్ ఎర్రబోయిన, నందగిరి అజయ్ కుమార్, ముద్రకోల నవీణ్ కుమార్, విజయ్ కుమార్ మువ్వ, రాజిడి రాకేష్, శివనాథుని సతీష్, ముద్దం విజేందర్ ఫ్రెండ్స్, సుభాష్ రెడ్డి దొంతులు, కవిత ఆనంద్, రాము మాడిశెట్టి, జితేందర్ కాండ్రె, కైలాసపు స్వప్న కిరణ్, చమిరాజ్ రామాంజనేయులు, శేఖర్ చాట్ల, మాధవి వేణు గోపాల్ లాలంగర్, నగేష్ టేకూరి, బండారు శ్రీధర్, అలెక్స్ తాళ్లపల్లి, సాయి కృష్ణ కోమాకుల, డార్విన్ బైసా, సురేష్ మాటేటి, అరుణ్ కానగంటి, వెంకటేష్ గుప్త గజవాడ, కారేన్ ఓంగ్, సందీష్ కొడుపుగంటి తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.