ఆస్ట్రియా : ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా నగరంలో తెలుగు సంఘం ఆస్ట్రియా ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ వేషధారణలో తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ పూల సోయగం, సాంప్రదాయ గీతాల మాధుర్యం, ఆటల సందడితో వేదికను తెలంగాణ ఊరితనంతో నింపేశారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొనడంతో పండుగ మరింత రంజుగా మారింది.
ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం ఐఎఫ్ఎస్ అధికార నిధి ధిమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విదేశాల్లోనూ భారతీయులు తమ మూలాలను మరువకుండా పండుగలు ఘనంగా జరుపుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. ఇది తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాజుల పండుగను కూడా ప్రత్యేకంగా జరిపారు.