హైదరాబాద్ : తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) కెనడాలోని( Canada) హాలిఫ్యాక్స్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరొక్కతీరు పూలతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడపడుచులు అంతా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.