లండన్ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడాన్ని తీవ్రంగా ఖండించిన ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపి ప్రజలంతా గర్వించేలా చేసిన నాయకుడిని అగౌరపరిచి ఇబ్బంది పెట్టడాన్ని ఎన్నారైలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక కక్ష సాధింపులతో కాలాన్ని గడుపుతున్నారని మండిపడ్డారు.
ఇలాంటి నోటీసులతో కేసీఆర్ని ఏమీ చెయ్యలేరని, ఇంతకంటే పెద్ద పెద్ద నాయకులతోనే కొట్లాడి గెలిచి తెలంగాణను గెలిపించిన ధీరుడు కేసీఆర్ అన్నారు. ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలని దేశమంతా తెలియజేసేలా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపడతామని అనిల్ కూర్మాచలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.