సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్లో నివసించే తెలుగు బాలబాలికలకు గత 12 సంవత్సరాలుగా సేవా ధృక్పదంతో నిర్విరామంగా తరగతులు నిర్వహిస్తున్నది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం పాఠ్యప్రణాళికతో సాగే ఈ తరగతులు కొవిడ్-19 సమయంలో సైతం జూమ్ మాధ్యమంలో నిర్వహించబడ్డాయి.
2021-2022 విద్యా సంవత్సరానికి మే నెలలో పరీక్షలు నిర్వహించగా జూలై 17న స్నాతకోత్సవం జరిపి ఉత్తీర్ణులైన బాలబాలికలందరికి ప్రశంసా పత్రాలు అందించారు. సుమారు 50 మంది బాలబాలికలతో పాటు వారి తల్లితండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి స్వాతి కురిచేటి వాఖ్యాతగా వ్యవహరించగా.. వివిధ సాంసృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు పదికాలాలు నిలవాలంటే భాషే ప్రధానమన్నారు. విద్యా సంవత్సర ప్రణాళికను తెలుగుబడి కార్యనిర్వహణాధికారి, తెలుగు సమాజం కోశాధికారి మల్లికార్జునరావు పాలెపు తల్లితండ్రులకు వివరించారు. తెలుగుబడి విజయవంతంగా నిర్వహించబడుతుందంటే గానికి కారణం ఉత్సాహం చూపించిన విద్యార్థులు, తల్లితండ్రులదేనన్నారు.
అలాగే విలువైన సమయాన్ని కేటాయించిన గురువుల కృషి మరువలేనిదన్నారు.
కాగా, తెలుగుబడి టీచర్లు కాయల రాఘవేంద్ర, కొనిజేటి శ్రీలక్ష్మి, దొంతు కిరణ్, ఆలపాటి రాఘవ, కనగాల సౌందర్య, వల్లభజోస్యుల రంగనాధ్, ముల్పూరి ప్రతిమలను సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం ఘనంగా సన్మానించింది.