న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్సుక్ మాండవీయ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ కూడా ఆయన ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బుధవారం మాండవీయ ప్రమాణ స్వీకారం చేశారు. మాండవీయది గుజరాత్. ఆయన వయసు 49 ఏళ్లు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కూడా. క్యాబినెట్ విస్తరణలో ఆరోగ్యశాఖను దక్కించుకున్న మాండవీయ.. కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖను కూడా నిలుపుకున్నారు. గుజరాత్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో మాండవీయ .. వెటర్నరీ సైన్స్ చదివారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ సైన్సులో మాస్టర్స్ పూర్తి చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో సభ్యుడిగా ఉన్న ఆయన 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.