ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్-2, స్కేల్-3 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 500
అర్హతలు: డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 25 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 5
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 22
వెబ్సైట్: www.bankofmaharashtra.in