కామారెడ్డి, మార్చి 16 : దొడ్డు రకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు. ధాన్యానికి బోనస్ ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదని అన్నా రు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, బీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి అశోక్, గరిగంటి లక్ష్మీనారాయణ, భూమేశ్‌యాదవ్, గైని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాన్సువాడ టౌన్, మే 16 : బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా రైతులతో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎన్నికలు ముగియగానే సన్నరకం వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
వెంటనే రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెర్రె నర్సింహులు, సీనియర్ నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీధర్, వాహబ్, ఎజాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఉదయ్, మండల కార్యదర్శి రాజేశ్వర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.