కంటేశ్వర్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన సుంకరి నరసయ్య, లక్ష్మీల రెండో కుమారుడు హరీశ్ బోన్ క్యాన్సర్తో (Bone Cancer) తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. కొన్నేండ్ల క్రితం బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన హరీశ్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఇంటికి తిరిగివచ్చారు. దీంతో పరీక్షలు చేయించగా అతనికి బోన్ క్యాన్సర్ అని తేలడంతో ఉన్న ఆస్తులు అమ్ముకొని చికిత్స చేసుకున్న రోగం నయం కాకపోవడం, వైద్యం కోసం అధిక మొత్తంలో ఖర్చవుతుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బంధువులు, స్నేహితులు చేయూత అందించినప్పటికీ అది వైద్యానికి ఏమాత్రం సరిలేదు. దీంతో దాతలు సహకరించి తనను బ్రతికించాలని హరీశ్ వేడుకుంటున్నారు. తన కుమారుడి వైద్యం కోసం ఇప్పటికే ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేశామని, దాదాపు రూ.80 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఇకపై వైద్యానికి భరించే స్తోమత తమకు లేదని, ప్రభుత్వం తమ కుమారున్ని ఆదుకోవాలని హరీశ్ తండ్రి వేడుకున్నారు.
కాగా, హరీశ్ ఖర్చులకోసం గ్రామ యువతరం యూత్ రూ.30 వేలు ఆర్థికసాయం చేశారు. లక్షలు ఖర్చుచేసినా ఆరోగ్యం కుదుటపడకపోతుండటంతో చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చవుతుందని యువతరం యూత్ అధ్యక్షుడు మహేందర్ అన్నారు. ప్రజా ప్రతినిధులు, తమ గ్రామ యువకుడిని ఆదుకొని వైద్యానికి సహకరించాలన్నారు. సహాయం చేయాలనుకునే దాతలు హరీశ్ మొబైల్ నంబర్ 9381384011కు సంప్రదించాలని కోరారు.