వినాయక్ నగర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్( Traffic Police Station) ఆవరణలో బాలాజీ అనే యువకుడు ఒంటిపై డిజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ( Suicide attempt) ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని కంటేశ్వర్ ఏరియాలో పానిపూరి బండి నిర్వహించే యువకుడు ఫుట్పాత్ పై నుంచి తన తోపుడు బండి తొలగించారని ఆరోపిస్తూ తన వెంట బాటిల్లో తెచ్చుకున్న డిజిల్ ను ఒంటి పై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా కంటేశ్వర్ ఏరియాలో ఉన్న తోపుడు బండ్లను ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నుంచి తొలగించారు. కేంద్ర మంత్రి పర్యటన ముగిసి వారం, పదిరోజులు కావస్తున్నా తనకు అనుమతివ్వడం లేదంటూ బాలాజీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అనంతరం తన వెంట బాటిల్లో తెచ్చుకున్న డిజిల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే యత్నించాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు యువకుడిని పట్టుకొని నియంత్రించారు. ఇ
దంతా ఉద్దేశపూర్వకంగాన్ని చేశారని ఫుట్పాత్ పై ఉన్న తోపుడు బండ్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించామని వెల్లడించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని అదుపులోకి తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించామని, స్టేషన్ ఆవరణలో న్యూసెన్స్ చేసిన యువకుడిపై కేసు నమోదు చేశామని సీఐ వివరించారు.
అయితే బాధితుడి వెంట వచ్చిన మరో ముగ్గురు యువకులు ఈ తతంగాన్ని సెల్ఫోన్ లో వీడియో రికార్డు చేశారని వారిపై కూడా విచారణ నిర్వహిస్తున్నామని చెఊప్పారు. రెచ్చగొట్టే ఘటనలకు పాల్పడిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.