మోస్రా (చందూ ర్), ఏప్రిల్ 28: మోస్రా మండల శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లి మృతి చెందగా, అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన కుస్నం జైపాల్ రెడ్డి కూతుళ్లు దేవిరెడ్డి (17), మహరెడ్డి రెండురోజుల క్రితం మోస్రాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు.
సోమవారం రాత్రి స్కూటీపై తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ఆరబోసిన వరి కుప్పలను వీరి వాహనం ఢీకొన్నది. దీంతో ఇద్దరు కిందపడిపోగా, గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్సులో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ చెల్లి దేవిరెడ్డి మృతి చెందగా, అక్క మహరెడ్డికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై రాజు తెలిపారు. దేవిరెడ్డి ఇటీవల ఇంటర్ పూర్తిచేసింది.