రుద్రూర్, మే 14: ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడడానికి అలవాటు పడ్డాడు.
తన తండ్రి ఫోన్ నుంచి రూ.ఐదు వేలు తన ఫోన్లోకి పంపుకొని గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయాయన్న మనస్తాపంతో మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.