ఖలీల్వాడి, ఆగస్టు 23: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ నార్త్, సిరికొండ, డిచ్పల్లి తదితర మండలాల్లో వర్షం కురిసింది.
ఇదిలా ఉండగా ఈ నెల 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.