పోతంగల్ : బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ప్రతి స్వయం సహాయక సంఘలు మహిళ సద్వినియోగం చేసుకుని అభివృద్ధిబాటలో నడవాలని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ ( Bank Manager Chandra Shekar) సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం సిద్ధి రుణ సంబంధిత మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ.. మహిళలు రుణ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలు పొందవచ్చు అని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ మల్లికార్జున్, మహిళలు తదితరులు ఉన్నారు.
పీఆర్డీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
మండల కేంద్రం పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మండలంలోని 36 మంది మహిళా టీచర్లను ఈ సందర్భంగా సన్మానించారు. సమాజంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం గర్వంగా ఉందని పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగనాథ్, ఉపాధ్యాయులు , తదితరులు ఉన్నారు.