Pothangal | పోతంగల్లో గాలి బీభత్సం.. నేలకొరిగిన మొక్కజొన్న
పోతంగల్ మండలంలోని కోడిచర్లలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన తీవ్రగాలులతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో 15 నుండి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలి బీభత్సానికి తట్టుకోలేక నేలవాలింది. దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pothangal | పోతంగల్, పిబ్రవరి 24 : పోతంగల్ మండలంలోని కోడిచర్లలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన తీవ్రగాలులతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో 15 నుండి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలి బీభత్సానికి తట్టుకోలేక నేలవాలింది. దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటకు విత్తనాలు, ఎరువులు, కూలీలు వంటి బారి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర గాలులకు పంట నష్టపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో ఉన్న రైతులకు ఒక్కసారిగా గాలులు పంటలను దెబ్బతీశాయి. నష్టపోయిన తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి సుప్రియ నేలకొరిగిన పంటలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో వివరాలు తెలుసుకుని ప్రాథమిక అంచనగా సుమారు 20నుండి 25 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

