MLA Prashanth Reddy | ఓడినా.. గెలిచినా.. ప్రజల వెంటే బీఆర్ఎస్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
ఓడినా.. గెలిచినా.. ప్రజల వెంటే బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భీమ్గల్ మండలానికి మంజూరైన పలు అభివృద్ధి పనులను ఆయన ఆదివారం పరిశీలించారు.
MLA Prashanth Reddy | నిజామాబాద్ : ఓడినా.. గెలిచినా.. ప్రజల వెంటే బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భీమ్గల్ మండలానికి మంజూరైన పలు అభివృద్ధి పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్ల నిధులతో భీమ్గల్ అభివృద్ధి తమ హయాంలో కృషి చేశామని, రూ.35 కోట్లతో 100 పడకల ఆసుపత్రి 75శాతం పనులు పూర్తి జరిగిందని, ఇంకా 25శాతం పనులు రెండున్నర ఏళ్లుగా పెండింగ్ ఉన్నాయని మండిపడ్డారు.
కాంట్రాక్టర్కు రూ.13 కోట్లు ఇచ్చామని, రూ.90 లక్షలు బకాయి ఉందని చెప్పారు. 3 నెలల్లో ఆసుపత్రి తెరిపిస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ రూ. 5 కోట్ల హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. రూ. 3 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నిలిచిపోయాయన్నారు. భీమ్గల్ బస్ డిపో మూతపడిందని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. బడా భీమ్గల్ బ్రిడ్జి ఏడాదైనా రిపేర్ చేయలేదని, నెలలోపు ఆసుపత్రి, బ్రిడ్జి పూర్తిచేయాలని లేకుంటే ఆందోళన చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. రూ.7 కోట్ల పనులు పూర్తిచేయాలని, లేదంటే కాంగ్రెస్ మూల్యం చెల్లిస్తుందని చెప్పారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

