వివాహేతర సంబంధాని అడ్డుగా ఉన్నాడని..
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులకు భార్య ఫిర్యాదు చేసి నమ్మించే ప్రయత్నం చేసింది.
- ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
- రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీకరణ
- విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు
రామారెడ్డి (సదాశివనగర్), జూన్10: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులకు భార్య ఫిర్యాదు చేసి నమ్మించే ప్రయత్నం చేసింది. పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఇందుకుసంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సదాశివనగర్ మం డలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45) మే 22న రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి మృతి చెందినట్లు అతడి భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ సంతోష్‌తో కూడిన దర్యాప్తు బృందం ఘటనా స్థలిని పరిశీలించి, సాక్షుల వాంగ్ములాలు సేకరించింది. సీసీ ఫుటేజీ, పోస్టుమార్టం నివేదికను పరిశీలించి, తలపై బలంగా కొట్టడంతో మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది.
అనుమానితుడిగా ఉన్న గ్రామానికి చెందిన గంగశేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యోదంతం బయటపడింది. రాజయ్య భార్య రేణుక, గంగశేఖర్ మధ్య నాలుగేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. తమకు రాజయ్య అడ్డుగా ఉన్నాడని, అతడు చనిపోతే బీమా డబ్బులు కూడా పొందవచ్చని భార్య.. గంగశేఖర్తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. మే 21న రాజయ్యను గాంధారి ప్రాంతానికి గంగశేఖర్ పిలిపించుకొని ఫుల్లుగా మద్యం తాగించాడు.
మత్తులో ఉన్న రాజయ్య తలపై గంగశేఖర్ ఐరన్‌రాడ్‌తో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం వద్ద మోటారు సైకిల్‌ను అక్కడే వదిలి పారిపోయాడు. సాంకేతిక ఆధారాలతో నిందితులైన కంచర్ల గంగాశేఖర్, కంచర్ల రేణుకను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా వారికి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సదాశివనగర్ సీఐ సంతోష్ కూమార్,ఎస్సై పుష్పరాజ్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా ఆబినందించినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

