Pothamgal | పోతంగల్, జనవరి 31 : వాట్సాప్ వారధిగా నిరుపేదలకు సేవ చేస్తూ పోతంగల్ మండలానికి చెందిన సామాజిక సేవాకర్త డాక్టర్ సీతలే రమేష్ బాధితులకు సేవలందిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన పాగల నవీన్ దంపతులకు నెల క్రితం బాబు జన్మించాడు. బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేక హైద్రాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవీన్ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని సామాజిక సేవాకర్త సీతాలే రమేష్ కు సమాచారం అందించాడు.
దీంతో స్పందించిన సీతాలే రమేష్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా రూ.24 వేల విరాళాలు సేకరించి నవీన్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఇలా ఎంతో మంది బాధితులకు తన పోన్ స్టేటస్ ద్వారా వివరాలు షేర్ చేస్తూ సేవలందిస్తున్న సీతలే రమేష్ కు బాధితులు కృతఙ్ఞతలు తెలిపారు.