వినాయక్‌నగర్/సుభాష్‌నగర్, మే 31: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సృజన తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం జిల్లాకేంద్రానికి వచ్చారు. ఆమెకు స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజ్‌తో పాటు ఇతర న్యాయవాదులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
సీపీ సాయిచైతన్య జడ్జిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. గతంలో నిజామాబాద్ జిల్లా జడ్జిగా విధులు నిర్వహించానని, బార్, బెంచ్ మధ్య చక్కని సమన్వయం ఉండి దీర్ఘకాలిక న్యాయవివాదాలను పరిష్కరించుకున్న తీరును ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో సారంగపూర్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.